Content removal request!


ICC Announces Playing Conditions For World Test Championship Final Between India & New Zealand

ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలకుంటే పరిస్థితి ఏమిటన్న సందేహాలపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు........ ఫైనల్ మ్యాచ్ 5 రోజుల్లో ఫలితం తేలకపోతే భారత్, న్యూజిలాండ్ జట్లను... ఉమ్మడి విజేతలుగా ప్రకటించనున్నట్లు వెల్లడించింది. WTC ఫైనల్ మ్యాచ్ డ్రా ఐనా టై ఐనా..2 జట్లు ఉమ్మడి విజేతలుగా నిలుస్తారని స్పష్టం చేసింది. ఐదు రోజుల ఆట......... పూర్తిగా సాగని పక్షంలో రిజర్వుడేను ICC కేటాయించింది. జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య WTC ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. జూన్ 23ను రిజర్వుడేగా ఉండనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రకటనకు ముందే ఆయా నిర్ణయాలు తీసుకున్నారు. టెస్టు మ్యాచ్ ఐదు రోజుల ఆటలో భాగంగా రోజుకు.. 90 ఓవర్లు ఆట సాగాల్సి ఉంది. ఆ మేరకు ఆట జరగని పక్షంలో రిజర్వుడేలో........... మిగతా ఓవర్లు వేయనున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో రిజర్వుడే ఉపయోగించే విషయంపై.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ జట్లకు సమాచారం అందిస్తారు. ఐదవ రోజు చివరి గంట ఆట ఉందనగా..... అప్పుడు నిర్ణయం ప్రకటించనున్నారు. ఫైనల్ మ్యాచ్ లో గ్రేడ్-1 డ్యూక్ బంతులను ఉపయోగించనున్నారు. #EtvAndhraPradesh #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------