ఒలింపిక్స్ లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగు తేజం...... స్టార్ షట్లర్ పి.వి. సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో సింధు ఒలింపిక్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూఫ్ జెలో భాగంగా హాంకాంగ్ కు చెందిన చెయుంగ్ ఎంగన్ తో జరిగిన మ్యాచ్ లో 21-9, 21-16తో వరుస సెట్లల్లో విజయం సాధించింది. తొలి సెట్ ను 21-9తో సునాయసంగా గెలిచిన సింధుకు..... రెండో సెట్ లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడి చెరో పాయింట్ సాధించడంతో..... 8-8తో స్కోరు సమమైంది. ఈ దశలో.... సింధు స్మాష్ లు, క్రాస్ కోర్టు రిటర్న్స్ , ర్యాలీలతో ప్రత్యర్థిని కోర్టు చుట్టూ పరుగులు పెట్టించింది. సింధు వరుస పాయింట్లు సాధించి 21-16తో సెట్ తో పాటు మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ప్రపంచ 34 వ ర్యాంకర్ అయిన చెయుంగ్ తో సింధుతో ఏడు సార్లు తలపడగా..... ఆరు సార్లు సింధునే విజయం సాధించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ మియా బ్లిచ్ ఫెల్డ్ తో సింధు తలపడనుంది. #EtvAndhraPradesh #LatestNews #NewsOfTheDay #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------