భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు బ్యాట్‌తో మైదానంలోకి వస్తుంటే..? దేశం, ప్రదేశంతో సంబంధం లేకుండా అభిమానుల కేరింతలతో స్టేడియం మార్మోగిపోయేది. మళ్లీ ఆ స్థాయిలో మహేంద్రసింగ్ ధోనీపై అభిమానులు ఇప్పుడు ప్రేమని కురిపిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడిన ధోనీకి అక్కడ స్టేడియాల్లో అభిమానుల నుంచి లభించిన స్వాగతం చూసి కంగారూ జట్టు ఆటగాళ్లు సైతం అవాక్కయ్యారు. తాజాగా న్యూజిలాండ్ గడ్డపైనా అదే సీన్.. ధోనీ బ్యాటింగ్‌కి వస్తుంటే.. అవే అరుపులు.. ప్రేమని కురిపిస్తూ లెక్కలేనన్ని ప్లకార్డులు స్టేడియంలో దర్శనమిస్తున్నాయి. #IndiaVsNewZealand #MsDhoni #2ndODI #FansCrazy